మాక్లూర్ మండలంలోని గొట్టుముక్కుల గ్రామంలో చైన్ స్నాచింగ్ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సావిత్రి అనే మహిళ ఇంటి సమీపంలో ఉండగా, గుర్తుతెలియని వ్యక్తి ద్విచక్ర వాహనంపై అక్కడికి వచ్చాడు.
అనూహ్యంగా ఆమె మెడలో ఉన్న రెండు తులాల బంగారు గొలుసును లాక్కొని పరారయ్యాడు. ఈ ఘటనతో బాధితురాలు ఒక్కసారిగా షాక్కు గురైంది. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.
బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తూ నిందితుడి ఆచూకీ కోసం గాలిస్తున్నారు.
