ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో నిజామాబాద్ పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో జరుగుతున్న ఏర్పాట్లను ఇన్‌చార్జ్ కలెక్టర్ భవేష్ మిశ్రా, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య శుక్రవారం పరిశీలించారు.
వేదిక, బారికేడింగ్, అతిథులు, ప్రజల కూర్చునే ఏర్పాట్లు, పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా చర్యలను పరిశీలించారు. వేడుకలకు హాజరయ్యే ప్రజలు, అధికారులు, ప్రముఖులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు.
ఆగస్టు 15న కార్యక్రమం ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా జరిగేలా పటిష్టమైన బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులను సీపీ ఆదేశించారు. అన్ని ఏర్పాట్లను నిర్ణీత సమయానికి పూర్తి చేయాలని సూచించారు.
కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) భుజంగరావు, ఏఆర్ ఏసీపీ శ్రీరాములు, మున్సిపల్ కమిషనర్ దిలీప్‌కుమార్, నిజామాబాద్ ఏసీపీ ప్రకాశ్, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ శ్రీధర్‌రెడ్డి, సీఐలు, ఆర్‌ఐలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
