నగరానికి చెందిన కరాటే మాస్టర్ ఎడ్ల వెంకటేష్ బ్లాక్ బెల్ట్ 5వ డాన్ కన్ఫర్మ్ డిగ్రీ సాధించారు. అంతర్జాతీయ బ్రూస్లీ అవార్డు గ్రహీత, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ యూకే గోల్డ్ మెడలిస్ట్గా ఆయన గుర్తింపు పొందారు.
ఆగస్టు 16న గ్రాండ్ మాస్టర్ ఎస్. శ్రీనివాసన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 5వ డాన్ కటాస్, స్పారింగ్ పరీక్షల్లో వెంకటేష్ ప్రతిభ కనబరిచి డిగ్రీ సాధించారు. అనంతరం ఆయనకు అడ్వాన్స్డ్ కటాస్పై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు.
నిజామాబాద్‌లో 25 ఏళ్లుగా నాణ్యమైన కరాటే శిక్షణ అందిస్తున్న వెంకటేష్‌ను గ్రాండ్ మాస్టర్ శ్రీనివాసన్ అభినందించారు. కరాటేలో నిజామాబాద్ జిల్లాను నంబర్ వన్‌గా నిలపడమే తన లక్ష్యమని వెంకటేష్ తెలిపారు. కార్యక్రమంలో చీఫ్ ఇన్స్ట్రక్టర్ రమేష్ పాల్గొన్నారు.
