నిజామాబాద్ నగర మేయర్ మాతృమూర్తి బెదిడ భారతి కన్నుమూశారు. ఆమె మృతితో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న నాయకులు, కార్యకర్తలు, కార్పొరేటర్లు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
పలువురు మేయర్ నివాసానికి చేరుకుని భారతి పార్థివదేహానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు.కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం..
భారతి అంతిమయాత్ర బుధవారం ఉదయం 11.30 గంటలకు కసాబ్గల్లీలోని స్వగృహం లో జరిగింది. ఈ అంతిమ యాత్రలో పలువురు కాంగ్రెస్ నాయకులు కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులు పాల్గొన్నారు.
