నిజామాబాద్ నగరంలో మిలాద్ ఉన్ నబీ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఖిలా రోడ్డు నుంచి ప్రారంభమైన మిలాద్ ఉన్ నబీ ర్యాలీ ఉత్సాహభరితంగా సాగింది.
అనంతరం ఖిలా రోడ్డు, నెహ్రూ పార్క్‌లో ఏర్పాటు చేసిన సభలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ప్రవక్త మహమ్మద్ బోధించిన ప్రేమ, శాంతి, సోదరభావం, మానవత్వం వంటి విలువలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని పిలుపునిచ్చారు.కులమతాలకు అతీతంగా ఐక్యంగా ముందుకు సాగుతూ తెలంగాణలోని గంగా జమునా తహజీబ్‌ను కాపాడుకోవాలని కోరారు.
మనిషిని మనిషిగా గౌరవించడం, ప్రేమించడం, కష్టాల్లో ఒకరికొకరు అండగా నిలవడమే నిజమైన మానవత్వమన్నారు. కులం, మతం, ప్రాంతం పేరుతో ప్రజల మధ్య విభేదాలు సృష్టించుకోవద్దని సూచించారు.
తెలంగాణ సమాజం ఎప్పటి నుంచో కులమతాలకు అతీతంగా కలిసి జీవించే గొప్ప సంస్కృతిని కలిగి ఉందని, ఈ సామరస్యాన్ని భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ప్రవక్త మహమ్మద్ చూపిన శాంతి, కరుణ, సహనం, సోదరభావం మార్గంలో సమాజం ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ సెక్యులర్ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తుందని తెలిపారు. కులం, మతం, భాష, ప్రాంతం అనే తేడాలు లేకుండా ప్రతి ఒక్కరినీ సమానంగా గౌరవించడం కాంగ్రెస్ పార్టీ విధానమన్నారు. తెలంగాణలో ప్రతి పౌరుడు ప్రశాంతంగా, గౌరవంగా జీవించేలా ప్రభుత్వం కృషి చేస్తోందని, అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు తెలిపారు.మిలాద్ ఉన్ నబీ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో వేలాది మంది ముస్లిం సోదరులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, యువత పాల్గొన్నారు.
ర్యాలీ మార్గంలో పండుగ వాతావరణం నెలకొంది.ఈ కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, రైతు కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, నుడా చైర్మన్ కేశ వేణు, శేఖర్ గౌడ్, నరాల రత్నాకర్, మత పెద్దలు, కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, యువజన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
