HomeTelanganaNizamabadAKFI జాతీయ న్యాయ నిర్ణేత పరీక్షలో ముగ్గురు నిజామాబాద్ జిల్లా వ్యాయామ ఉపాధ్యాయులు ఉత్తీర్ణత.

AKFI జాతీయ న్యాయ నిర్ణేత పరీక్షలో ముగ్గురు నిజామాబాద్ జిల్లా వ్యాయామ ఉపాధ్యాయులు ఉత్తీర్ణత.

హైదరాబాద్‌లో జూన్ 8వ తేదీ నుంచి 11వ తేదీ వరకు నిర్వహించిన అమాటేర్ కబడ్డీ ఫెడరేషన్ అఫ్ ఇండియా (AKFI) జాతీయ న్యాయ నిర్ణేత పరీక్షలో నిజామాబాద్ జిల్లాకు చెందిన ముగ్గురు వ్యాయామ ఉపాధ్యాయులు ఉత్తీర్ణత సాధించారు.

అనురాధ పీడీ , జ్యోతి పీడీ , సాయిలు పి ఈ టీ ఈ పరీక్షలో విజయవంతంగా ఉత్తీర్ణత సాధించి జాతీయ స్థాయి కబడ్డీ న్యాయ నిర్ణేతలుగా అర్హత పొందారు.

ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు అంద్యాల లింగయ్య , కే . గంగాధర్ రెడ్డి మరియు అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు వారిని అభినందించారు.

కబడ్డీ క్రీడ అభివృద్ధికి వీరు మరింత సేవలందించాలని ఆకాంక్షించారు.జిల్లా నుంచి జాతీయ స్థాయి న్యాయ నిర్ణేతలుగా అర్హత సాధించడం పట్ల క్రీడాభిమానులు, క్రీడాకారులు, వ్యాయామ ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments