అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని అధికారులు పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు పడకల్ తండా వద్ద అశోక్ లేలాండ్ మినీ ట్రక్కును తనిఖీ చేయగా..
ఎలాంటి అనుమతులు లేకుండా తరలిస్తున్న 34 క్వింటాళ్ల రేషన్ బియ్యం బయటపడింది. పట్టుబడిన బియ్యం విలువ సుమారు రూ.1.69 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు.
బియ్యాన్ని స్వాధీనం చేసుకుని, అక్రమ రవాణాకు సంబంధించి నిజామాబాద్‌కు చెందిన అబ్బాస్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
