రోడ్డుపై వెళ్తున్న మహిళ మెడలోని బంగారు పుస్తెలతాడును ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు అపహరించి పరారయ్యారు. ఈ ఘటన ఆర్మూర్‌లో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది.
పోలీసుల వివరాల ప్రకారం.. నందిపేట మండలం కుదాన్పూర్కు చెందిన శిల్ప భర్త చిరంజీవితో కలిసి పాత బస్టాండ్ నుంచి కొత్త బస్టాండ్ వైపు వెళ్తున్నారు.
అంబేద్కర్ చౌరస్తా వద్దకు చేరుకోగానే గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు మోటార్‌సైకిల్‌పై వచ్చి ఆమె మెడలోని రెండు తులాల బంగారు పుస్తెలతాడును లాక్కొని మామిడిపల్లి ఎక్స్‌రోడ్డు వైపు పరారయ్యారు.
బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దించారు.
