నిజామాబాద్ ఆర్టీసీ బస్టాండ్లో ఫిట్స్ వచ్చి పడిపోయిన సుమారు 60 ఏళ్ల గుర్తుతెలియని మహిళ చికిత్స పొందుతూ మృతి చెందింది. మంగళవారం ఉదయం సుమారు 10 గంటల సమయంలో బస్టాండ్లో మహిళ అస్వస్థతకు గురై పడిపోవడంతో ఆర్టీసీ సిబ్బంది వెంటనే ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. పోలీసుల విచారణలో మృతురాలి పేరు ఉష, వయసు సుమారు 60 ఏళ్లు అని తెలిసింది. అయితే ఆమె పూర్తి వివరాలు, కుటుంబ సభ్యుల ఆచూకీ తెలియరాలేదు.
మృతురాలి గురించి తెలిసిన వారు, ఆమె బంధువులు ఎవరైనా ఉంటే నిజామాబాద్ 1 టౌన్ పోలీస్ స్టేషన్ను 8712659714 నంబర్లో సంప్రదించాలని పోలీసులు కోరారు.
