HomeCRIMEమాజీ సర్పంచ్ వెంకన్న హత్యకు నిరసనగా వర్ని చౌరస్తాలో ధర్నా .....బాధితులతో కల్సి బైఠాయించిన పోచారం...

మాజీ సర్పంచ్ వెంకన్న హత్యకు నిరసనగా వర్ని చౌరస్తాలో ధర్నా …..బాధితులతో కల్సి బైఠాయించిన పోచారం తనయుడు

వర్ని మండలం తగిలేపల్లి గ్రామ మాజీ సర్పంచ్ శ్రీ వెంకన్న (మైసమ్ వెంకటేశ్వర్లు) హత్యకు నిరసనగా, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నియోజకవర్గ నాయకులతో కలిసి మాజీ డీసీసీబీ చైర్మన్ శ్రీ పోచారం భాస్కర్ రెడ్డి వర్ని చౌరస్తా లో ఆందోళనకు దిగారు

ఈ సందర్భంగా పోచారం భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ బాన్సువాడ నియోజకవర్గంలో హత్యా రాజకీయాలకు, హింసకు తావు లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు.

హత్యా రాజకీయాలను ప్రోత్సహించే నాయకుడు ఏనుగు రవీందర్ రెడ్డి డౌన్ డౌన్!”* అంటూ నినాదాలు చేశారు.

వర్ని మండలం తగిలేపల్లి గ్రామ మాజీ సర్పంచ్ శ్రీ వెంకన్న హత్య తీవ్రంగా కలచివేసిందని, ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

ఏనుగు రవీందర్ రెడ్డి ప్రధాన అనుచరుడు అదే గ్రామానికి చెందిన బక్క నారాయణ ఈ ఘటనలో నిందితుడిగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయిన నేపథ్యంలో, ఈ ఘటన వెనుక ఉన్న పూర్తి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని కోరారు.

గతంలో ప్రశాంతంగా ఉన్న బాన్సువాడ నియోజకవర్గంలో వలస నాయకులు రాజకీయ జోక్యంతో హింస, అలజడి పెరిగిన పరిస్థితులను ప్రజలు మరచిపోలేదన్నారు.

బాన్సువాడ నియోజకవర్గం ఎప్పుడూ శాంతి, సామరస్యాలకు నిలయంగా ఉందని, ఇక్కడ హింసకు, హత్యా రాజకీయాలకు, భయభ్రాంతులకు ఎలాంటి స్థానం ఉండకూడదని స్పష్టం చేశారు.

ప్రజల్లో భయాన్ని కలిగించే రాజకీయాలకు స్వస్తి పలకాలని, హింసకు తావిచ్చే రాజకీయ నాయకత్వాన్ని బాన్సువాడ నియోజకవర్గ ప్రజలు ప్రజాస్వామ్య పద్ధతిలో తిరస్కరించాలని పిలుపునిచ్చారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments