HomePOLITICAL NEWSఆ మీడియా కంట్రోల్ వుంటే మంచిది .....రాజ్ గోపాల్ రెడ్డి హెచ్చరిక

ఆ మీడియా కంట్రోల్ వుంటే మంచిది …..రాజ్ గోపాల్ రెడ్డి హెచ్చరిక

కాంగ్రెస్ పార్టీ అంతర్గత విషయాల్లో తనను టార్గెట్ చేస్తూ వార్తను వండివార్చుతున్న ఆంధ్ర మీడియా కంట్రోల్ ఉండాలని ఎవరికి ఊడిగం చెయ్యడానికి తనను టార్గెట్ చేస్తే మంచిగా వుండదని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హెచ్చరించారు .

ఇవాళ ప్రజాభవన్‌లో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఓ ప్రముఖ తెలుగు మీడియా సంస్థపై రాజగోపాల్ రెడ్డి నిప్పులు చెరిగారు. సదరు ఛానల్ ఎవరికి సపోర్ట్ చేస్తుందో తెలియదా అని ప్రశ్నించారు.

కొంచెం ఒళ్లు దగ్గర పెట్టుకుని ఉంటే మంచిదని.. లేకుంటే మర్యాద దక్కదని ఫైర్ అయ్యారు. ఒకవేళ నా ప్రతాపమే చూపిస్తే ఆ ఛానల్, పేపరే ఉండదని.. సదరు మీడియా అధిపతికి చెబుతున్నానని రాజగోపాల్ రెడ్డి హెచ్చరించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments