రాజకీయ లబ్ధి కోసమే పోచారం శ్రీనివాసరెడ్డి తనయుడు పోచారం భాస్కర్ రెడ్డి రోడ్డెక్కారని వర్ని మండల కాంగ్రెస్ నాయకులు ఏనుగు రవీందర్ రెడ్డి వర్గం నేతలు విమర్శించారు బుధవారం వర్ని మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు
వర్ని మండల కేంద్రంలో తగిలేపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ మాజీ సర్పంచ్ వెంకటి హత్య జరిగిన విషయమై 2 నిమిషాలు మౌనము పాటించడం ఆ కుటంబానికి కాంగ్రెస్ పార్టీ అండ ఉంటది అని నిందితులు బక్క నారాయణ ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేయడం జరిగింది.
మంగళవారం జరిగిన ఘటనను తమ రాజకీయ లబ్ది కొరకు వర్ని బాన్సువాడ ప్రధాన రహదారి పైన మాజీ డిసిసిబి చైర్మన్ పరిగె భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా మరియు రాస్తారోకోలో బాన్సువాడ నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి గారిపై అసభ్య ప్రచారాలు అనుచిత వ్యాఖ్యల గురించి.
కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను భంగంకలిగే విధంగా ఉన్నాయని.పూర్తి విచారణ చేసి సంబంధించిన నేరస్తులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు కొత్త బాలకృష్ణ వీర్రాజు మాసాని శ్రీనివాసరెడ్డి కొత్తకొండ భాస్కర్ బోయిడి లక్ష్మణ్ వివిధ మండలాల కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
