కండువాలు కప్పి ఆహ్వానించిన గణేష్ బిగాల నగరంలోని 29వ డివిజన్‌కు చెందిన పలువురు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో షేక్ మజీద్‌తో పాటు మహమ్మద్ తాజ్, షేక్ సూఫియన్, షేక్ తోఫిక్, షేక్ మెహబూబ్, షేక్ ముకీత్, అబ్దుల్ బషీర్ తదితరులు పార్టీలో చేరారు.
మొత్తం సుమారు 100 మంది బీఆర్ఎస్‌లో చేరినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.ఈ సందర్భంగా గణేష్ బిగాల వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్‌పై ప్రజల్లో విశ్వాసం రోజురోజుకూ పెరుగుతోందన్నారు.
పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ సముచిత గౌరవం కల్పిస్తూ అందరినీ కలుపుకొని ముందుకు సాగుతామని తెలిపారు.రానున్న రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో మాజీ మేయర్ దండు నీతు కిరణ్ శేఖర్, సిర్ప రాజు, మాజీ నుడా చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, అబ్దుల్ మతీన్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
