బాన్స్ వాడ అధికార పార్టీలో మాజీ సర్పంచ్ హత్య చిచ్చు రేపింది.ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి ల మధ్య ఆధిపత్య పోరు పరాకాష్ట కు చేరి చివరికి రోడ్డెక్కాయి.
వర్ని మండలం తగిలేపల్లి గ్రామ మాజీ సర్పంచ్ శ్రీ వెంకన్న (మైసమ్ వెంకటేశ్వర్లు) హత్యకు నిరసనగా, బాధిత కుటుంబానికి న్యాయం జరగాలని మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి వర్ని చౌరస్తా లో ఆందోళనకు దిగారు ఈ సందర్భంగా పోచారం భాస్కర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే ను నేరుగా టార్గెట్ చేసారు .
హత్యా రాజకీయాలను ప్రోత్సహించే నాయకుడు ఏనుగు రవీందర్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.మృతుడు మాజీ సర్పంచ్ మొదటి నుంచి పోచారం అనుచరుడిగా ముద్ర ఉంది.హత్య చేసారని భావిస్తున్న బక్క నారాయణ ఏనుగు రవీందర్ రెడ్డి ప్రధాన అనుచరుడుఉన్నారు.
హత్య తర్వాత నారాయణ నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయారు. హత్య కు కేవలం భూ వివాదమే కారణం ఆ విషయం గ్రామం లో అందరికి తెల్సిందే. ఇద్దరి మధ్య ఇందుకు సంబంధించి వైరం సాగుతుంది.అదీగాక నిందితుడు నారాయణ లొంగిపోయాడు కూడా.
కానీ తమ వర్గీయుడు వెంకన్న హత్య తో రగిలి పోయిన పోచారం శ్రీనివాస్ రెడ్డి తనయుడు భాస్కర్ రెడ్డి వర్ని చౌరస్తా లో బైఠాయించారు. ప్రశాంతంగా ఉన్న బాన్సువాడ నియోజకవర్గంలో వలస నాయకులు రాజకీయ జోక్యంతో హింస, అలజడి పెరిగిన పరిస్థితులను ప్రజలు మరచిపోలేదన్నారు.
హింసకు, హత్యా రాజకీయాలకు, భయభ్రాంతులకు ఎలాంటి స్థానం ఉండకూడదని స్పష్టం చేశారు.నిజానికి ఇటీవల పోచారం ప్రభుత్వ తీరు ను తీవ్ర స్థాయిలో ఎండ గట్టారు కెసిఆర్ ను పొగడతలతో ముంచెత్తారు దీన్ని ఆసరా గా చేసుకొని ఏనుగు వర్గీయలు ఇటీవలే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ పాల్గొన్న సమావేశం వద్ద కు వచ్చిబైఠాయించారు పోచారం మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలంటూ నినాదాలు చేసారు
ఈ పరిణామాలు పోచారం కొంత ఇరుకున పెట్టాయి. తగిలే పల్లి మాజీ సర్పంచ్ హత్య నేపథ్యంలో పోచారం వర్గీయులు సైతం ఏనుగు ను కౌంటర్ చెయ్యడానికి అస్రం లా చేసుకున్నారు .
