ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాంనగర్ చౌరస్తాలో గణేష్ ఉత్సవాలలో జరిగిన తొక్కిసలాట లో ఒకరు మృతి చెందారు రాంనగర్ చౌరస్తాలో ‘శ్రీ గణపతి యూత్ అసోసియేషన్’ ఆధ్వర్యంలో గణేష్ ఆగమన్ కార్యక్రమం కోసం ఘనంగా ఏర్పాట్లు చేశారు.
ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. భక్తులంతా ఒక్కసారిగా గూమిగూడడంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ క్రమంలో బద్రీనాథ్(19)అనే విద్యార్థి మృతి చెందారు.రాంనగర్‌లోని గౌరీశంకర్ అపార్ట్‌మెంట్‌లో నివాసముంటున్న బద్రీనాథ్.. ఏపీలోని కడప జిల్లాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు.
బద్రీనాథ్ నగరంలోని అబిడ్స్‌లో మెథొడిస్ట్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలో బీటెక్ చదువుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు
