తెలంగాణ రాష్ట్ర పిలుపు మేరకు, రాష్ట్ర అధ్యక్షుడు అంజి యాదవ్ ఆదేశాలతో మంగళవారం నిజామాబాద్‌లో హెచ్‌పీవీ వ్యాక్సిన్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎండల సురేష్ ఆధ్వర్యంలో జనసేన నిజామాబాద్ జిల్లా నాయకుడు గుండా సంతోష్ హెచ్‌పీవీ అవగాహన పోస్టర్‌ను ఆవిష్కరించారు.
అనంతరం ఎల్లమ్మగుట్టలోని ఆక్స్ఫర్డ్ పాఠశాలలో నిర్వహించిన హెచ్‌పీవీ వ్యాక్సిన్ కార్యక్రమానికి 20వ డివిజన్ కార్పొరేటర్, బీజేపీ సీనియర్ నాయకుడు న్యాలం రాజు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ ప్రాధాన్యత, ఆరోగ్య పరిరక్షణలో దాని ఉపయోగాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.
కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ రమణ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అనంతరం న్యూ ప్రియదర్శిని పాఠశాల ప్రిన్సిపల్ పుష్పలత ప్రకాశ్ కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు.అల్లు అర్జున్ ఫ్యాన్స్ జిల్లా, నగర కమిటీ సభ్యులు నవీన్, దీపక్, మహేష్, గోపి, బబ్లూ, కార్తీక్, సుమంత్, విఘ్నేష్, లక్ష్మణ్, శ్రీను, విజయ్‌తో పాటు అభిమానులు పాల్గొన్నారు.
