HomePOLITICAL NEWSఎర్రవెల్లిలో హై టెన్షన్ .....బిఆర్ యస్ కాంగ్రెస్ ల మధ్య హోరాహోరీ ......స్పీకర్ మీద ఎమ్మెల్సీ...

ఎర్రవెల్లిలో హై టెన్షన్ …..బిఆర్ యస్ కాంగ్రెస్ ల మధ్య హోరాహోరీ ……స్పీకర్ మీద ఎమ్మెల్సీ వ్యాఖ్యలకు నిరసనగా ఎర్రవెల్లి కెసిఆర్ ఫామ్ హౌస్ ముట్టడి ….భారీగా పోలీసు బలగాలు మోహరింపు …………ఎర్రవల్లి వైపు వెళ్లకుండా కట్టడి ………..అసెంబ్లీ నుంచి నేరుగా ఎర్రవెల్లి వెళ్తున్న కేటీఆర్ హరీష్ రావు లను అడ్డుకున్న పోలీసులు ………భారీగా తరలి వెళ్లిన కాంగ్రెస్ శ్రేణులు ….రేవంత్ కెసిఆర్ ల దిష్టి బొమ్మల దహనం

సిద్దిపేట జిల్లాఎర్రవల్లి లోని కెసిఆర్ ఫామ్ హౌస్ వద్ద మంగళవారం హై టెన్షన్ తలెత్తింది. బిఆర్ యస్ కాంగ్రెస్ శ్రేణులు హోరాహోరీగా తెలపడ్డాయి.పలు చోట్ల పరస్పర దాడులకు తెగబడ్డారు.

స్పీకర్ ను ఉద్దేశించి ఎమ్మెల్సీ తాత మధు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా వేయ్యి డప్పులతో ముట్టడిస్తామని కాంగ్రెస్ యస్సి సెల్ పిలుపు నిచ్చింది. ఇందులో భాగంగా సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు అంక్షారెడ్డి రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు డప్పుల చప్పుళ్లతో కేసీఆర్ వ్యవసాయ క్షేత్రం కు మంగళవారం ముట్టడికి బయలుదేరారు.

ముందస్తు సమాచారం మేరకు భారీగా మోహరించిన పోలీసులు కేసీఆర్ వ్యవసాయ క్షేత్రం వైపు వెళ్లే మార్గాలను మూసేసారు కానీ అనేక ప్రాంతాల్లో పోలీసులను తోసేసి కాంగ్రెస్ శ్రేణిలు వెళ్లాయి విషయం తెల్సి బిఆర్ యస్ శ్రేణులు సైతం ఎర్రవెల్లి వైపు పరుగులు తీశారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం మర్కుక్ మండలం వరదరాజపూర్ గ్రామంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది.

కాంగ్రెస్ శ్రేణులు, పోలీసుల మధ్య తోపులాట, వాగ్వాదం చోటుచేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.పలు వాహనాల మీద బిఆర్ యస్ శ్రేణులు రాళ్ల విసిరారు.

ఎర్రవెల్లి లో హై టెన్షన్ నెలకొన్న నేపథ్యంలో అసెంబ్లీ లో ఉన్న బి ఆర్ యస్ ఎమ్మెల్యే లు కేటీఆర్ హరీష్ రావు తదితరులు వేరువేరుగా వాహనాల్లో ఎర్రవెల్లి వైపు వెళ్లారు వారంతా ఎర్రవెల్లి కి వెళ్తే పరిస్థితి మరింత జటిలంగా మారే ప్రమాదం వుండడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు వారందరిని హైదరాబాద్ లో ముందస్తుగా అదుపులోకి తీసుకోని బోయిన్ పల్లి స్టేషన్ కు తరలించారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments