HomeCRIMEసైబర్‌ నేరగాళ్లపై పోలీసుల కొరడా47 మంది అరెస్టు.. రూ.99.79 లక్షలు రీఫండ్‌ఏడు రాష్ట్రాల్లో 36 కేసుల...

సైబర్‌ నేరగాళ్లపై పోలీసుల కొరడా47 మంది అరెస్టు.. రూ.99.79 లక్షలు రీఫండ్‌ఏడు రాష్ట్రాల్లో 36 కేసుల ఛేదన.. ముగ్గురు నిందితుల పేర్లు వెల్లడి

సైబర్‌ నేరగాళ్లపై హైదరాబాద్‌ సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు కొరడా ఝళిపించారు. ఆగస్టు నెలలో దేశవ్యాప్తంగా ఏడు రాష్ట్రాల్లో ప్రత్యేక ఆపరేషన్లు నిర్వహించి 36 సైబర్‌ నేరాల కేసుల్లో 47 మంది నిందితులను అరెస్టు చేశారు. బాధితులు కోల్పోయిన రూ.99,79,057 మొత్తాన్ని రీఫండ్‌ చేయించారు.

ఎన్‌సీఆర్‌పీ ద్వారా అందిన ఫిర్యాదుల్లో 65 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.అరెస్టయిన వారిలో తెలంగాణకు చెందిన 15 మంది, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 14, ఢిల్లీకి చెందిన 8, మహారాష్ట్ర, కర్ణాటకకు చెందిన నలుగురేసి, హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఒక్కొక్కరు ఉన్నారు.

పెట్టుబడి మోసాల్లో 16 మంది, ట్రేడింగ్‌ మోసాల్లో 12 మంది, సోషల్‌ మీడియా మోసాల్లో ఏడుగురు, ఓటీపీ మోసాల్లో ముగ్గురు, ఇంపర్సనేషన్‌ మోసాల్లో ముగ్గురు, ఉద్యోగ మోసాల్లో ఇద్దరు, క్రెడిట్‌ కార్డు మోసాల్లో ఇద్దరు, ఏపీకే, అడ్వర్టైజ్‌మెంట్‌ మోసాల్లో ఒక్కొక్కరిని అరెస్టు చేశారు.

పోయిన ఫోన్‌తో రూ.25.50 లక్షలు స్వాహాఅబిడ్స్‌ బస్‌స్టాండ్‌ నుంచి బస్సులో ప్రయాణిస్తున్న గోడిశాల కిష్టయ్యకు చెందిన మొబైల్‌ ఫోన్‌ ఫిబ్రవరి 28న పోయింది. అనంతరం ఆయన బ్యాంకు ఖాతా నుంచి తనకు తెలియకుండానే యూపీఐ లావాదేవీల ద్వారా రూ.25,50,750 బదిలీ అయినట్లు గుర్తించారు.

దీనిపై సైబర్‌ క్రైమ్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.ఈ కేసులో **మోసిన్‌ షేక్‌ (29), బింగిన్‌పల్లి వెంకట కృష్ణ (23), ఇతాడి సంతోష్‌ (22)**లను అరెస్టు చేశారు. వీరి నుంచి నాలుగు మొబైల్‌ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

ఈ కేసు క్రైం నంబర్‌ 279/2026గా నమోదు కాగా, ఐటీ యాక్ట్‌లోని 66సీ, 66డీ, బీఎన్‌ఎస్‌లోని 318(4), 319(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.రూ.17.77 కోట్ల నష్టంఆగస్టులో 34 కేసుల్లో బాధితులు రూ.17,77,59,200 కోల్పోయారు.

ఇందులో రూ.99,79,057ను రీఫండ్‌ చేయించారు. ట్రేడింగ్‌ మోసాల్లో రూ.17.05 కోట్లకుపైగా నష్టం జరగగా రూ.57.96 లక్షలు, ఏపీకే మోసాల్లో రూ.12.42 లక్షలు, బిజినెస్‌ మోసాల్లో రూ.7.18 లక్షలు, వాట్సాప్‌ డీపీ మోసంలో రూ.15.50 లక్షలు తిరిగి ఇప్పించారు.1,317 ప్రొఫైళ్లు తొలగింపుఆన్‌లైన్‌ గేమింగ్‌, అక్రమ బెట్టింగ్‌, నకిలీ పెట్టుబడి వెబ్‌సైట్లను ప్రచారం చేస్తున్న 1,317 సోషల్‌ మీడియా ప్రొఫైళ్లు, 2,573 పెయిడ్‌ ప్రకటనలను పోలీసులు గుర్తించి తొలగించారు.

వీటికి సంబంధించి తొమ్మిది ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌లలో అనుమానాస్పదంగా ఉన్న మరో 231 ప్రొఫైళ్లను గుర్తించి తొలగించేలా చర్యలు చేపట్టారు.349 ఎఫ్‌ఐఆర్‌లుజోనల్‌ సైబర్‌ సెల్స్‌కు 2,952 ఎన్‌సీఆర్‌పీ ఫిర్యాదులు అందగా 349 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి.

16 కేసుల్లో 20 మందిని అరెస్టు చేసి రూ.41,05,886 బాధితులకు రీఫండ్‌ చేశారు. సి-మిత్ర ద్వారా బాధితులకు అవగాహన కల్పిస్తూ 2,043 కాల్స్‌ చేయగా, 290 జీరో ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు.డిజిటల్‌ అరెస్ట్‌ పేరుతో మోసాలుసీబీఐ, ఆర్‌బీఐ, ఈడీ, కస్టమ్స్‌, కోర్టులు, సైబర్‌ క్రైమ్‌ పోలీసుల పేరుతో బెదిరింపు వీడియో కాల్స్‌ వస్తే నమ్మవద్దని పోలీసులు సూచించారు.

చట్టంలో ‘డిజిటల్‌ అరెస్ట్‌’ అనే విధానం లేదని స్పష్టం చేశారు. నకిలీ పెట్టుబడి గ్రూపులు, ఏపీకే ఫైళ్లు, ఫిషింగ్‌ లింకులు, వాట్సాప్‌ డీపీ, హనీట్రాప్‌, మ్యాట్రిమోనియల్‌ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.సైబర్‌ మోసానికి గురైతే వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు ఫోన్‌ చేసి, cybercrime.gov.inలో ఫిర్యాదు చేయాలని అదనపు పోలీస్‌ కమిషనర్‌ క్రైమ్స్‌ అండ్‌ సిట్‌ హైదరాబాద్‌ సిటీ సూచించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments