సెల్‌ఫోన్ రిపేర్ చేయించుకునేందుకు అమీర్‌పేట్‌కు వచ్చిన ఓ యువతి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందింది. ర్యాపిడో బైక్‌పై అమీర్‌పేట్‌కు వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
బిగ్‌బజార్ వెనుక గేటు సమీపంలో ఆమె ప్రయాణిస్తున్న బైక్‌ను బస్సు ఢీకొట్టింది. దీంతో యువతి రోడ్డుపై పడిపోగా.. బస్సు ఆమె తలపై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందింది.ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్ అన్వర్ షేక్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
