యూట్యూబర్ వైష్ణవి హత్య చేసిన ఆమె భర్త హరిబాబును కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి హతమార్చిన నిందితులు నాటకీయ పక్కీలో లొంగిపోయాడు. నిజామాబాద్ నగరంలోని రాజరాజేంద్ర సినిమా టాకీస్ వద్ద మెయిన్ రోడ్డు మీద అందరు చూస్తుండగా కేవలం 8 సెకన్ల వ్యవధిలోనే 9 కత్తిపోట్లతో హరిబాబును ఆయన బామ్మర్ది సంతోష్ కొబ్బరి బొండాలు కట్ చేసే కత్తి తో కిరాతకంగా హతమార్చి కారు లో పారిపోయాడు.
నేరుగా అదే కారు లో సొంత ఊరు కోరుట్ల . వెళ్ళిపోయాడు అక్కడే స్థానిక పోలీసు స్టేషన్ లో కి వెళ్లి లొంగిపోయాడు తాను నిజామాబాద్ నగరంలో బావ హరిబాబు ను హత్య చేసి వచ్చినట్లుగా చెప్పడం తో అప్రమత్తం అయినా పోలీసులు అతని అదుపులోకి తీసుకోని వెంటనే నగరంలో రెండో టౌన్ పోలీసులకు సమాచారం ఇవ్వడం తో పాటు నిందితుడి ని అదే రాత్రి నిజామాబాదు కు తరలించారు.
అంతకుముందు నిందితుడు కారు లో వెళ్తూ తాను ఎందుకు హత్యకు పాల్పడాల్సి వచ్చిందో చెప్తూ ఓ సెల్ఫీ వీడియో సోషియల్ మీడియాలో పోస్ట్ చేసారు తన చెల్లి జరిగినట్లుగా మరొకరి జరగొద్దనే ఇలా చేసానని అనుకోకుండా తాను నిజామాబాద్ వచ్చానని హరి బాబు బెయిల్ మీద వచ్చి ఇక్కడే ఉన్నట్లు తెలిసి అప్పటికప్పుడే తాను హత్య చేశానన్నారు.
అసలు పోలీసులే తమకు న్యాయం చేస్తారని ఎదురు చూశామని కానీ వారు జస్ట్ కేసు వేసి వదిలేశారని పౌర సమాజం తన చర్యను ఆమోదించాలని ఆయన కోరడం గమనార్హం.
