కామారెడ్డి ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్న సాయిలు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఇటీవల సస్పెన్షన్‌కు గురై ఇంటి వద్ద ఉంటున్న ఆయన మనోవేదనకు గురై కామారెడ్డిలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నట్లు బంధుమిత్రులు తెలిపారు.సాయిలుకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.
కుటుంబానికి పెద్దదిక్కును కోల్పోయామని కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు.
