Tuesday, April 21, 2026
HomeTelanganaNizamabadఎంపీ అరవింద్ ఇల్లు ముట్టడి , లాఠీ ఛార్జ్.. నీట్ పరీక్షను వెంటనే రద్దు చేయాలి...

ఎంపీ అరవింద్ ఇల్లు ముట్టడి , లాఠీ ఛార్జ్.. నీట్ పరీక్షను వెంటనే రద్దు చేయాలి నరేంద్ర మోడీ ఇప్పటివరకు స్పందించకపోవడం దుర్మార్గం

నీట్ పరీక్షను వెంటనే రద్దు చేయాలని నరేంద్రమోడీ వెంటనే స్పందించాలని పి.డి.ఎస్.యూ జిల్లా అధ్యక్షులు ఆర్ గౌతం కుమార్ , AIPSU జిల్లా ప్రధాన కార్యదర్శి బోడ అనిల్ కుమార్ డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఎంపీ అరవింద్ ఇల్లు ముట్టడి చేయటం జరిగింది. పోలీసులు లాఠీ ఛార్జ్ చేసి అరెస్టు చేసి 3వ టౌన్ కి తరలించడం జరిగింది.అరెస్టు అయిన విద్యార్థి సంఘాల నాయకులను NSUI రాష్ట్ర ఉపాధ్యక్షులు ,జిల్లా ఇన్చార్జి వెంకటస్వామి పరామర్శించారు.

ఈ సందర్భంగా పి.డి.ఎస్.యూ జిల్లా అధ్యక్షులు గౌతం కుమార్, AIPSU జిల్లా ప్రధాన కార్యదర్శి బోడ అనిల్ కుమార్ లు మాట్లాడుతూ ..

దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే నీట్ పరీక్ష ప్రశ్నపత్రం లీకై ఫలితాల్లో స్కామ్ జరిగిందని,ఒకే పరీక్ష కేంద్రంలో 8 విద్యార్థులకు 720కి 720 మార్కులు రావడంపై అనుమానాలు వ్యక్తం అయితున్నాయని , ఒక్కో పరీక్ష పత్రం లెకేజీలో లక్షల రూపాయలు చేతులు మారాయని,లక్షలాదిమంది జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతుందని, ఓకే పరీక్ష కేంద్రంలో 67 మందికి ఎలా టాప్ ర్యాంకులు ఎలా వస్తాయని ,సుప్రీంకోర్టులో కూడా పలు పిటిషన్లు దాఖలు అయ్యాయని ,నీట్ పరీక్ష ఫలితాలు జూన్ 14న విడుదల చేయాల్సింది ఎన్నికల ఫలితాల రోజే నాలుగున ఎందుకు విడుదల చేశారని .

వీటన్నిటిని చూస్తే ఫలితాల్లో జరిగాయని , కావున సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఉన్నత స్థాయి దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు.

మోడీ వెంటనే రాజీనామా చేయాలని, NTA ను రద్దు చేయాలని , నీట్ పరీక్ష ను మళ్ళీ నిర్వహించాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో PDSU ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ ,AIPSU సాయికుమార్,NSUI జిల్లా అధ్యక్షులు వేణు రాజ్ , SFI జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు మహేష్, విఘ్నేష్, AISF జిల్లా అధ్యక్షులు అంజలి , PDSU జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నరేందర్, డా.గణేష్ .విద్యార్థి సంఘాల నాయకులు ప్రిన్స్, కార్తీక్,సాయినాథ్, నిఖిల్ రెడ్డి, గణేష్,ఆజాద్, సందీప్, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!