అనుమానాస్పదంగా వ్యక్తి మృతి..నిజామాబాద్ జిల్లా రైల్వే స్టేషన్ పరిధిలో అనుమానాస్పదంగా వ్యక్తి మృతి చెందిన ఘటన శనివారం చోటు చేసుకుంది.పోలీస్ లు తెలిపిన వివరాల ప్రకారం..
నగరంలోని గుర్తు తెలియని వ్యక్తి రైల్వే స్టేషన్ పరిధిలోనీ ఓ హోటల్ ముందు పడి ఉన్నట్లు స్థానికులు గమనించారు. స్థానికులు గమనించి పోలీసులకు తెలిపారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా అప్పటికే మృతి చెందినట్లు పోలీస్ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.
సదరు ఆ వ్యక్తి వివరాలు ఆరా తీస్తున్నారు. మృతుని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.