Tuesday, April 21, 2026
HomeCRIMEమురికి కాలువలో ఆడ శిశువు.

మురికి కాలువలో ఆడ శిశువు.

మురికి కాలువలో ఆడ శిశువు.అప్పుడే పుట్టిన ఆడ శిశువును గుర్తు తెలియని వ్యక్తులు మురికి కాలువలో పడేసిన హృదయ విధాకర ఘటన నిజామాబాద్ నగరంలోని మూడవ టౌన్ పరిధిలో శనివారం చోటుచేసుకుంది.

మూడవ టౌన్ ఎస్ఐ ప్రవీణ్ తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని పాముల బస్తి కాలనీలో మురికి కాలువలో శిశువు మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

సమాచారం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకొని శిశువుని పరిశీలించగా మృతి చెందినట్లు వెల్లడించారు అనంతరం మృతదేహాన్ని నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు .

పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని మూడవ టౌన్ ఎస్సై ప్రవీణ్ పేర్కొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!