నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సింగనవర్ గారి ఆదేశాల మేరకు అడిషనల్ డీసీపీ కోటేశ్వరరావు మరియు ఏసిపి నిజామాబాద్ రాజా వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో పట్టణ సీఐ నరహరి మరియు మూడవ పట్టణ ఎస్సై ప్రవీణ్ కుమార్ ఒక హైటెక్ వ్యభిచార మూట యొక్క గుట్టు రట్టు చేశారు.
వివరాల్లోకి వెళితే నిజామాబాద్ పట్టణంలోని సుభాష్ నగర్ ఏరియాలో ఒక ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారని సమాచారం మేరకు మూడో పట్టణ ఎస్ఐ ప్రవీణ్ మరియు పట్టణ సీఐ నరహరి లు కలిసి అట్టి ఇంటిపై దాడి చేసి ఇద్దరూ మహిళలతో పాటుగా, ఒక విటుడిని మరియు వ్యభిచార నిర్వాహకురాలిని అదుపులోనికి తీసుకొని విచారించి కేసు నమోదు చేశారు.
సుభాష్ నగర్ లో ఎలిజబెత్ రాణి ఒక ఇంటిని అద్దెకు తీసుకొని కొంతమంది మహిళలను ఎరవేసి వారికి డబ్బుల ఆశ చూపించి వారి యొక్క ఫోటోలను వాట్సాప్ లో కొంతమంది వ్యక్తులకు పంపించి విటులను పిలిపించి వ్యభిచారం నిర్వహిస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు. నిజామాబాద్ నగరంలో ఇదేవిధంగా కొంతమంది మహిళలను డబ్బుల ఆశ చూపించి వ్యభిచార కూపం లోనికి లాగుతున్నారు.
ఇట్టి వ్యభిచార గృహంలో కిరాయికి తీసుకొని నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకురాలు ఎలిజబెత్ రాణి మరియు విటుడు శ్రీకాంత్ ను అదుపులోనికి తీసుకొని వారి వద్ద నుంచి 3000 రూపాయలు కండోమ్ ప్యాకెట్లను స్వాధీనం పరుచుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు పంపించనున్నట్టుగా పట్టణ సీఐ నరహరి తెలిపారు.
ఇంటి దాడిలో పట్టణ సిఐ నరహరి తో పాటుగా మూడో పట్టణ ఎస్ఐ ప్రవీణ్ కుమార్ ఏఎస్ఐ లీలా కృష్ణ, లక్ష్మీనారాయణ, కానిస్టేబుల్ రఘువర్ధన్, చామీoద్, గంగ కుమార్, అబ్బులు, బాబులు పాల్గొన్నారు. పట్టణంలో ఎక్కడైనా వ్యభిచార గృహంలో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడినట్లైతే పోలీసులకు లేదా డయల్ 100 కు సమాచారం ఇవ్వవలసిందిగా పేర్కొన్నారు.