రైల్వే స్టేషన్ లో బాలుడి అదృశ్యం…నిజామాబాద్ జిల్లా రైల్వే స్టేషన్ పరిధిలో బాలుడు అదృశ్యం అయ్యాడు. రైల్వే ఎస్ఐ సాయి రెడ్డి తెలిపిన కథనం ప్రకారం.
మాక్లూర్ మండలంలోని మదన్ పల్లి గ్రామానికి చెందిన బాలుడు మహేందర్ ( 2).
గురువారం తల్లిదండ్రులు పింకీ, లక్షన్ లు కలసి నిజామాబాద్ రైల్వే స్టేషన్ ఫ్లాట్ ఫారం పైన నిద్రించారు.
అనంతరం రెండు గంటల తరువాత లేచి చూసేసరికి బాలుడు కనిపించలేదు.దీంతో వారు హుటాహుటిన రైల్వే స్టేషన్ పరిధిలో అంతట వెతికారు.
ఎక్కడ కనిపించకపోవడం తో శుక్రవారం నిజామాబాద్ రైల్వే పోలీస్ లకు సమాచారం అందించారు.సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సాయి రెడ్డి పేర్కొన్నారు.
బాలుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. బాలుని వివరాలు తెలిసిన వారు 8712658591 కు తెలపగలరని ఎస్ఐ పేర్కొన్నారు.
