HomeCRIMEగర్ల్స్ హాస్టల్ అల్పాహారంలో బల్లి పడితే యూనివర్సిటీ అధికారులు స్పందించరా - SFI

గర్ల్స్ హాస్టల్ అల్పాహారంలో బల్లి పడితే యూనివర్సిటీ అధికారులు స్పందించరా – SFI

తెలంగాణ యూనివర్సిటీ ఇన్చార్జ్ వైస్ ఛాన్స్లర్ సందీప్ కుమార్ సుల్తాన్య గారు సందర్శించలి – SFI డిమాండ్

నిర్లక్ష్యం వాహించిన కేర్ టేకర్లను సస్పెండ్ చేయాలి.

ఈరోజు భారత విద్యార్థి ఫెడరేషన్ (SFI) నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రాచకొండ విగ్నేష్ మాట్లాడుతూ తెలంగాణ విశ్వవిద్యాలయంలోనీ గర్ల్స్ హాస్టల్ మెస్ అల్పాహారంలో బల్లి పడితే యూనివర్సిటీ అధికారులు స్పందించకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.

అదేవిధంగా విద్యార్థినులకు నాణ్యమైన భోజనాన్ని అందించని కేర్ టేకర్లపై ఇప్పటివరకు రిజిస్ట్రార్ యాదగిరి గారు చర్యలు తీసుకోకపోవడం విడ్డూరం అని అన్నారు.

అదేవిధంగా తెలంగాణ యూనివర్సిటీ ఇన్చార్జ్ వైస్ ఛాన్స్లర్ సందీప్ కుమార్ సుల్తాన్య తెలంగాణ యూనివర్సిటీ నీ సందర్శించాలని డిమాండ్ చేశారు.

విద్యార్తినిలు అనారోగ్యపాలవుతే ఎలా అని ప్రశ్నించారు. గతంలో గర్ల్స్ హాస్టల్ లో ఇలాంటి సంఘటనలు అనేకసార్లు జరిగిన యూనివర్సిటీ యంత్రాంగం పట్టించుకోవడంలో విఫలమైందని అన్నారు.

వెంటనే వంట మాస్టర్ లపై చర్యలు తీసుకొని విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని లేకపోతే యూనివర్సిటీ పరిపాలన భవనాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు మహేష్, నగర అధ్యక్షులు గణేష్, వేణు, రాజు తదితర నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments