చిక్కుడులో ఇప్పటి వరకు మనం రెండు రకాలు చూశాం… కానీ ఇప్పుడు మన ఇందూరు మార్కెట్ లో కొత్తరకo చిక్కుడు వచ్చేసింది. దీన్ని ‘వింగ్డ్ బీన్’ గా పిలుస్తున్నారు.
సాధారణంగా ‘వింగ్డ్ బీన్’ అని పిలువబడే దీనికి ‘ఫోర్-యాంగిల్డ్ బీన్’, ‘మనీలా బీన్’, ‘గోవా బీన్’ వంటి అనేక ప్రాంతీయ పేర్లు కూడా ఉన్నాయి. ఆగ్నేయాసియాకు చెందిన ఈ మొక్క, అనేక రకాలుగా ఉపయోగపడే పోషకాలు సమృద్ధిగా ఉన్న ఉష్ణమండల చిక్కుడు జాతి మొక్కగా ఎంతో గుర్తింపు పొందింది. దీని పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి.
అంతగా ప్రాచుర్యం పొందని ఈ చిక్కుడు జాతి మొక్కలో అద్భుతమైన పోషక విలువలు దాగి ఉన్నాయి.
ఈ రెక్కల చిక్కుడు
పాపువా న్యూ గినియా, ఇండోనేషియా దేశాలలో ఈ మొక్కకు సంబంధించిన అత్యధిక రకాలు కనిపిస్తాయి. శాస్త్రవేత్తలు ఇది అక్కడే మొదట పుట్టి ఉండవచ్చని బలంగా నమ్ముతారు.
రానున్న రోజుల్లో మన ప్రాంతాల్లో కూడా బాగా ‘చుర్యంలోకి తేదగిన అద్భుత పోషక విలువలు కలిగిన పంట వింగ్ బీన్. ప్రొటీన్, పీచు, బీకాంప్లెక్స్ విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. మాంసకృత్తులు, ఖనిజాలు, విటమిన్లు తగుపాళ్లలో వింగ్ బీన్స్లో ఉన్నయి.
థయామిన్, పైరిడాక్సయిన్ (విటమిన్ బి-6), నియాసిన్, రిబోఫ్లావిన్ వంటి బికాంప్లెక్స్ విటమిన్లు ఉన్నాయి. ఇనుము, రాగి, మాంగనేసు, కాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం వంటి అవసరమైన ఖనిజాలు ఉన్నాయి.
వింగ్ బీన్ ఆకుల్లో పీచు, విలమిన్ ఎ, సి, ఖనిజాలు ఉన్నాయి. వంద గ్రాముల తాజా ఆకుల్లో 45 మిల్లీ గ్రాముల విటమిన్ సి, 8090 ఇంటర్నేషనల్ యూనిట్ల విటమిన్ ఎ ఉంటాయి.
