HomeDevotionalచంద్రాయన్‌పల్లిలో వినూత్నంగా గణపతి నిమజ్జనం .....చెరువు నీటి తో శాస్రోక్తంగా సాగిన కతృవు..

చంద్రాయన్‌పల్లిలో వినూత్నంగా గణపతి నిమజ్జనం …..చెరువు నీటి తో శాస్రోక్తంగా సాగిన కతృవు..

పర్యావరణ పరిరక్షణ స్ఫూర్తి ని ఇందల్వాయి మండలం చంద్రాయన్‌పల్లి గ్రామం చాటింది భారీ విగ్రహాల అందులోనూ కెమికల్ ఉండే రంగుల విగ్రహాల స్థానం లో మట్టి తో తయారు చేసిన గణపతి విగ్రహాలనే ప్రతిష్టించారు . గ్రామంలో 11 రోజుల పాటు భక్తిశ్రద్ధలతో నిత్య పూజలు అందుకున్న మట్టి గణపతి విగ్రహాన్ని చెరువులో నేరుగా నిమజ్జనం చేయకుండా .

చెరువు నుంచి నీటిని తీసుకొచ్చి, పసుపు కలిపిన నీటితో గణపతి విగ్రహాన్ని కరిగించారు అదికూడా గ్రామస్తులు భారీ సంఖ్య లో తరలి రాగా పండితులు శాస్రోక్తంగా నిర్వహించారు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ మట్టి గణపతిని నీటిలో నేరుగా వేయకుండా ఈ విధంగా నిమజ్జనం నిర్వహించడం గ్రామంలో ప్రత్యేకంగా నిలిచింది.

గ్రామ పండితులు సూచించిన విధంగా సంప్రదాయ పద్ధతులను పాటిస్తూ కార్యక్రమాన్ని నిర్వహించారు. 11 రోజుల పాటు భక్తులతో పూజలు అందుకున్న గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం నిమజ్జన కార్యక్రమాన్ని చేపట్టారు.ఈ సందర్భంగా గ్రామస్తులు భక్తిశ్రద్ధలతో పాల్గొని గణపతికి వీడ్కోలు పలికారు.

ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంత వాతావరణంలో కార్యక్రమం కొనసాగింది. వినూత్న పద్ధతిలో గణపతి నిమజ్జనం నిర్వహించడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, భక్తులు, యువకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments