సాధారణంగా ఆదివారం బ్యాంకులకు సెలవు. కానీ.. సోమవారం నుంచి మూడు రోజుల పాటు బ్యాంకు ఉద్యోగులు, సిబ్బంది నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం కూడా బ్యాంకులు తెరుచుకున్నాయి.
ఇప్పటికే గతంలో దశలవారీగా నిరసనలు చేపట్టిన ఉద్యోగ సంఘాలు.. తమ డిమాండ్ల సాధన కోసం సోమవారం నుంచి మూడు రోజుల పాటు ఆందోళనలు నిర్వహించేందుకు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో వరుస నిరసనల కారణంగా బ్యాంకింగ్ సేవలకు అంతరాయం కలగకుండా ఆదివారం సెలవు రోజైనప్పటికీ బ్యాంకులను తెరిచి కార్యకలాపాలు నిర్వహించారు.
ఐదు రోజుల పనిదినాలు అమలు చేయాలని బ్యాంకు ఉద్యోగ సంఘాలు చాలాకాలంగా డిమాండ్ చేస్తున్నాయి.గత కొన్ని రోజుల క్రితం నిరసన కార్యక్రమాలు చేపట్టాయి.
అయినప్పటికీ డిమాండ్లపై స్పష్టమైన నిర్ణయం వెలువడకపోవడంతో తాజాగా మరోసారి ఆందోళనలకు సిద్ధమయ్యాయి. సోమవారం నుంచి వరుసగా మూడు రోజుల పాటు నిరసనలు నిర్వహించనున్నట్లు ప్రకటించాయి.
