జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ సాయి చైతన్య 36 ఫిర్యాదులను స్వీకరించారు.
జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితుల సమస్యలను ఆయన నేరుగా విని, వాటిని చట్ట ప్రకారం పరిష్కరించాలని సంబంధిత పోలీస్ అధికారులను ఆదేశించారు.
ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకునేందుకు సంబంధిత పోలీస్‌స్టేషన్ల ఎస్‌ఐలు, సీఐలతో ఫోన్‌లో మాట్లాడి సమస్యల పరిష్కారానికి సూచనలు చేశారు.
ప్రజలు ఎలాంటి పైరవీలు, మూడో వ్యక్తుల ప్రమేయం లేకుండా నేరుగా పోలీసులను సంప్రదించి తమ సమస్యలను పరిష్కరించుకోవచ్చని సీపీ తెలిపారు.ప్రతి సోమవారం ప్రజావాణి నిర్వహించి ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించి పరిష్కరిస్తున్నట్లు తెలిపారు.
