గణేష్ నిమజ్జనం సందర్భంగా మద్యం సేవించి వాహనం నడుపుతున్న వ్యక్తికి న్యాయస్థానం ఏడు రోజుల జైలు శిక్ష విధించింది. టౌన్-2 ఎస్ఐ యాదగిరి గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. వినాయక్‌నగర్‌కు చెందిన గోతియం రాజు గణేష్ విగ్రహాన్ని నిమజ్జనానికి తీసుకెళ్తున్న లారీని నడుపుతుండగా పోలీసులు ఆపి డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్ష నిర్వహించారు.
ఆల్కహాల్ రీడింగ్ 222గా నమోదైంది. దీంతో రాజును ప్రత్యేక జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచగా ఏడు రోజుల జైలు శిక్ష విధించారు. అలాగే నిమజ్జనం సందర్భంగా న్యూసెన్స్‌కు పాల్పడిన బొబ్బిలివీధికి చెందిన ఆకుల మహేందర్‌పై పోలీసులు బీఎన్‌ఎస్ 292 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు.
అతడిని మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచగా రూ.1,000 జరిమానా విధించారు. నిమజ్జనం సందర్భంగా నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని రెండవ టౌన్ ఎస్సై యాదగిరి గౌడ్ హెచ్చరించారు.
