నిజామాబాద్ నగరంలోని కోటగల్లిలో పేకాట స్థావరంపై నాల్గో టౌన్ పోలీసులు దాడి చేసి 8 మందిని అరెస్టు చేశారు. గోనెరెడ్డి కళ్యాణ మండపం వెనక భాగంలో పేకాట ఆడుతున్నారన్న సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు.
పేకాట ఆడుతున్న ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.31 వేల నగదు, ఎనిమిది సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను పోలీస్‌స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
