జిల్లాలోని బదిరులకు తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా తెలిపారు. డెఫ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం నగరంలోని న్యూ అంబేద్కర్ భవన్ లో అంతర్జాతీయ సంకేత భాషా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… బధిరులకు మేథోశక్తి ఎంతో ఉంటుందన్నారు. సామాన్యులకు ధీటుగా పోటీ ప్రపంచంలో ముందుకు వెళ్ళడం అభినందనీయమన్నారు. బదిరులుగా ఉంటూ ప్రభుత్వ ఉద్యోగులుగా స్థిరపడటం సంతోషంగా ఉందన్నారు. లోపాన్ని పట్టించుకోకుండా తమ పని తాము చేసుకుంటూ పోవాలని విజయం వరిస్తుందన్నారు. కార్యక్రమంలో డెఫ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు ఉదయ్ కుమార్, ప్రధాన కార్యదర్శి మహేష్, 19వ డివిజన్ కార్పొరేటర్ నాగోల్ల లక్ష్మీనారాయణ, జ్యోతి మురళి, తదితరులు పాల్గొన్నారు.
