HomeTelanganaNizamabadఎన్నికల్లో గెలవడం చేతగాక రాద్ధాంతం ......ఎంపీ అర్వింద్ ధ్వజం

ఎన్నికల్లో గెలవడం చేతగాక రాద్ధాంతం ……ఎంపీ అర్వింద్ ధ్వజం

ఎన్నికల్లో గెలవడం చేతగాక కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్ మీద రాద్ధాంతం చేస్తుందని ఎంపీ అర్వింద్ ఆగ్రహం వ్యక్తం చేసారు నిజామాబాద్ వచ్చిన ఆయన మీడియా తో మాట్లాడారు ప్రజలు ఆ పార్టీకి వోట్లు వేసే పరిస్థితి లేకుండా పోయిందని ఎవరైనా వోట్లు వేద్దామన్న రాహుల్ గాంధీ ని చేసే అసలే వెయ్యరని దేశంలో ఓటు చోరీ జరగడం లేదని.. రాహుల్‌ గాంధీ అఖల్‌ చోరీ జరుగుతోందని అన్నారు.

ఎన్నికల సంఘంలో అభిప్రాయ భేదాలు ఉండటం సహజమేనని.. అయితే తుది నిర్ణయం చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ తీసుకుంటారని చెప్పారు. ప్రస్తుతం ఎన్నికల సంఘం తీసుకుంటున్న నిర్ణయాలు రాజ్యాంగబద్ధంగానే జరుగుతున్నాయని పేర్కొన్నారు. గాంధీ కుటుంబానికి ప్రజాస్వామ్య విధానాలు అర్థం కావడం లేదని.. అందుకే కాంగ్రెస్‌ పార్టీ దేశంలో చీలిపోయిందన్నారు మమతా శరత్ పవర్ మూపనార్ జగన్ లాంటి నేతలు పార్టీ వదిలేశారని రేపో మాపో రేవంత్ కూడా వెళ్తాడని అరవింద్‌ అన్నారు విమర్శించారు.

ఎన్నికల కమిషన్ ను కాంగ్రెస్ పార్టీ ఎలా వాడుకుందో దేశ ప్రజలకు తెల్సు ఆరేళ్ళు ఎన్నికల కమిషనర్ గా పనిచేసిన టి ఎన్ శేషన్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసారు కేపీ గిల్ ఏకంగా కేంద్ర మంత్రి గా పనిచేసారని అర్వింద్ గుర్తు చేసారు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ వోటు ఎటూ పోలేదు ఎన్నికలఅధికారులు వెరిఫికేషన్ కు వచ్చినప్పుడు నిద్రపోయాడెమో అని అర్వింద్ సెటర్ వేశారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments