HomeTelanganaNizamabadజర్నలిస్టుల సమస్యలపై ‘ఛలో నిజామాబాద్‌’కు పిలుపు

జర్నలిస్టుల సమస్యలపై ‘ఛలో నిజామాబాద్‌’కు పిలుపు

జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం శుక్రవారం నిజామాబాద్‌లో భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్‌ చేస్తూ తెలంగాణ యూనియన్‌ ఆఫ్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్స్‌, ఇండియన్‌ జర్నలిస్ట్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి పిలుపునిచ్చారు.

నిజామాబాద్‌ ప్రెస్‌క్లబ్‌ నుంచి ఉదయం 10 గంటలకు ర్యాలీ ప్రారంభమై గాంధీచౌక్‌లోని విగ్రహం వరకు కొనసాగనుంది. జిల్లాలోని మండలాలు, పట్టణాల ప్రెస్‌క్లబ్‌ల సభ్యులు, రిపోర్టర్లు, జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని నిర్వాహకులు కోరారు.

తమ పరిధిలోని ప్రతి జర్నలిస్టుకు సమాచారం అందించి కార్యక్రమానికి తరలించాలని సూచించారు.జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా ఉద్యమించాలని జిల్లా కమిటీ పిలుపునిచ్చింది.

ఆందోళనలో పాల్గొని సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరింది. జిల్లా అధ్యక్షుడు ఎడ్ల సంజీవ్‌, ప్రధాన కార్యదర్శి టీ. అరవింద్‌ బాలాజీ ఈ మేరకు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments