సమాజంలో నేరాల నియంత్రణే ధ్యేయంగా నిజామాబాద్ జిల్లా పోలీస్ శాఖ వినూత్న ప్రచార పద్ధతులకు శ్రీకారం చుట్టింది. డ్రగ్స్ బారిన పడకుండా యువతను కాపాడటం, రోడ్డు భద్రతా నియమాలు, సైబర్ నేరాల పట్ల అప్రమత్తతపై ప్రజలను చైతన్యం చేసేందుకు ‘నిజామాబాద్ పోలీస్ కళాబృందం’ అహర్నిశలు కృషి చేస్తోంది.
నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య., ఆదేశాల మేరకు ఈ కళాబృందం ఉమ్మడి జిల్లాలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ల పరిధిలోని ప్రతీ గ్రామానికి వెళ్తూ ప్రజల్లో మార్పు తెస్తోంది.పాటలు, నాటకాల రూపంలో వినూత్న ప్రచారం కేవలం పోలీస్ హెచ్చరికలకే పరిమితం కాకుండా, ప్రజల మనసులను హత్తుకునేలా పాటలు, నాటకాల రూపంలో కళాబృందం ప్రదర్శనలు ఇస్తోంది.
పగలు, రాత్రి తేడా లేకుండా పల్లెపల్లెకూ తిరుగుతూ ప్రజల భయాలను తొలగిస్తూ, మోసపూరిత మానసిక దోపిడీ నుంచి వారిని కాపాడేందుకు సందేశాలను ఇస్తోంది. జనవరి 2026 నుండి సెప్టెంబర్ 2026 వరకు జిల్లా వ్యాప్తంగా ఏకంగా 106 అవగాహన కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించినట్లు సీపీ సాయి చైతన్య వెల్లడించారు.
యువత డ్రగ్స్ వైపు మొగ్గు చూపకుండా అవగాహన కల్పిస్తూ, సమాచారం తెలిస్తే 1908 నంబర్‌కు తెలపాలని సూచన.సైబర్ & ఆన్‌లైన్ మోసాలు: సైబర్ నేరాల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని, బాధితులు వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1930ను సంప్రదించాలి.
మహిళల రక్షణ: కొత్త చట్టాలపై అవగాహన కల్పిస్తూ, ఆపదలో ఉంటే షీ టీమ్ నంబర్ 87126-59795 లేదా డయల్ 112కు కాల్ చేయాలి.ట్రాఫిక్ నిబంధనలు: హెల్మెట్ ధరించడం, మద్యం తాగి డ్రైవింగ్ చేయకపోవడం, సెల్‌ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపకపోవడంపై రోడ్డు భద్రతా పాఠాలు.
మొబైల్ ఫోన్ల రికవరీ: పోగొట్టుకున్న ఫోన్లను CEIR పోర్టల్ ద్వారా ఎలా వెతికిపట్టుకోవాలో అవగాహన. ఇతర భద్రతలు: కల్తీ కల్లు నివారణ, సీసీ కెమెరాల ఏర్పాటు, చైన్ స్నాచర్ల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు
అవగాహన కల్పించారు.
గ్రామాల్లో ఈ కళాబృందానికి ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తోందని, ఈ పర్యటనల ద్వారా ప్రజల్లో సానుకూల మార్పు స్పష్టంగా కనిపిస్తోందని సీపీ తెలిపారు. ప్రజల చైతన్యమే తమ ప్రధాన కర్తవ్యమని ఆయన పేర్కొన్నారు.
