HomeTelanganaNizamabadగాంధీ జయంతి సందర్భంగా మహాత్మా గాంధీకి గణేష్ బిగాల నివాళులు

గాంధీ జయంతి సందర్భంగా మహాత్మా గాంధీకి గణేష్ బిగాల నివాళులు

మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల గాంధీ చౌక్‌లోని మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహాత్మా గాంధీ చూపిన సత్యం, అహింస, శాంతి, సహనం, సేవా మార్గాలు నేటి సమాజానికి కూడా ఎంతో స్ఫూర్తిదాయకమని అన్నారు.

దేశ స్వాతంత్ర్యం కోసం గాంధీజీ చేసిన త్యాగాలు, ప్రజలను ఏకతాటిపైకి తీసుకువచ్చిన ఆయన నాయకత్వం భారత చరిత్రలో చిరస్మరణీయమని పేర్కొన్నారు.

గాంధీజీ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టి సమాజంలో శాంతి, సామరస్యం, సోదరభావాన్ని పెంపొందించాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ దండు నీతు కిరణ్ శేఖర్,నగర అధ్యక్షులు సిర్ప రాజు,మాజీ నూడ చైర్మెన్ ప్రభాకర్ రెడ్డి,సత్య ప్రకాష్,సుజిత్ సింగ్,జగత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments