HomeTelanganaNizamabadమున్నూరు కాపు సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక..

మున్నూరు కాపు సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక..

నిజామాబాద్ జిల్లా మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో నూతన కార్యవర్గాన్ని నియమించినట్లు సంఘం జిల్లా అధ్యక్షులు ధర్మపురి సంజయ్ తెలిపారు. జిల్లా కార్యవర్గ సభ్యులుగా సుగంధం మురళి, సుగంధం సతీష్, ఆది రేఖుల సాయిలు, సోమినేని రాజేందర్, ఇంతు సత్యజీత్, ఇంతు ప్రవీణ్ కుమార్, ముహూర్ నవీన్ కుమార్, నాయికవాడ్ జగన్నాథ్, మల్లయ్య సుదర్శన్, పెద్గంగండి రవీంద్ర స్వామి తదితరులను నియమించినట్లు సంఘం ప్రతినిధులు తెలిపారు.

మహిళా విభాగంలో మమత లావణ్య, మమత మంజుల సునీత, మమత చంద్రకళలకు బాధ్యతలు అప్పగించారు. యువజన విభాగంలో సుధం హరీష్, ఈశ్వర్ శ్రీధర్, కొడవలి రణధీర్, ఉల్లెంగ నారాయణ్ తదితరులను నియమించినట్లు తెలిపారు.

మున్నూరు కాపు సంఘం బలోపేతానికి, సభ్యుల సంక్షేమానికి, సామాజిక సేవా కార్యక్రమాల నిర్వహణకు నూతన కార్యవర్గం కృషి చేయాలని సంఘం జిల్లా అధ్యక్షులు ధర్మపురి సంజయ్ ఆకాంక్షించారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సభ్యులను పలువురు అభినందించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments