నగరంలోని కృష్ణ మందిర్ బైపాస్ రోడ్డులో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ఆదివారం త్రీటౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సుమారు 30 నుంచి 35 ఏళ్ల వయసున్న వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.
మృతుడి కుడి చేతికి ఇటీవల శస్త్రచికిత్స జరిగినట్లు, కుడి చేయి తొలగించిన ఆనవాళ్లు ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. మృతుడి వివరాలు, కుటుంబ సభ్యుల ఆచూకీ కోసం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మృతుడిని ఎవరైనా గుర్తించినా, ఆయన కుటుంబ సభ్యులు లేదా బంధువుల వివరాలు తెలిసినా త్రీటౌన్ పోలీసులను సంప్రదించాలని, 8712659839 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని ఎస్ఐ హరిబాబు సూచించారు.
