HomeTelanganaNizamabadడీసీసీబీ పీఠం కోసం దిగ్గజ నేతల ఆధిపత్య పోరు .........మహేష్ వర్సెస్ సుదర్శన్ రెడ్డి ...............ఇద్దరూ...

డీసీసీబీ పీఠం కోసం దిగ్గజ నేతల ఆధిపత్య పోరు ………మహేష్ వర్సెస్ సుదర్శన్ రెడ్డి ……………ఇద్దరూ రెడ్డి నేతల పేర్లే సిఫార్స్ ………ఢిల్లీ కి చేరిన పంచాయితీ ……..

నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ) చైర్మన్‌ పదవి అధికార పార్టీలో దిగ్గజ నేతల అధిపత్యానికి తెరలేపింది. పదవి ఇప్పుడు జిల్లా కాంగ్రెస్‌ రాజకీయాల్లో కీలక మలుపుగా మారింది. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రభుత్వ సలహాదారుడు సుదర్శన్ రెడ్డి లు ఈ పదవి కోసం వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు.

దిగ్గజ నేతలు ఇద్దరు రెడ్డి నేతల కోసం పట్టు బడుతుండడం పార్టీ వర్గాలకు ఆసక్తిగా మారింది. గతంలో మేయర్ స్థానం కోసం వంశీ హోటల్ అధినేత నరేందర్ రెడ్డి ని రంగంలోకి దించిన మహేష్ ఇప్పుడు అదే సామజిక వర్గం కు చెందిన పురణ్ రెడ్డి కోసం పట్టు పడుతున్నారు.

మరో వైపు సుదర్శన్ రెడ్డి తన కుటుంబ సభ్యుడైన కుంట రమేష్ రెడ్డి కోసం పావులు కదుపుతున్నారు రమేష్ రెడ్డి ప్రస్తుతం డీసీసీబీ ఛైర్మెన్ గా ఉన్నారు ఆయన గతంలో టిఆర్ యస్ లో మంత్రి ప్రశాంత్ రెడ్డి కి అత్యంత సన్నిహితుడి గా ఉండి డీసీసీబీ వైస్ ఛైర్మెన్ గాపనిచేసారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పార్టీ మారి అవిశ్వసం తో భాస్కర్ రెడ్డి వైదొలగడంతో ఛైర్మెన్ స్థానం దక్కించుకున్నారు.

గతంలో ఎన్నిక పక్రియ లో ఈ పదవి నియామకం అయ్యేది మెజార్టీ సింగిల్ విండోలు గెలిచిన పార్టీలే డీసీసీబి పీఠం దక్కేది.ఎంత పెద్ద లీడర్ అయినా సరే కచ్చితంగా సింగిల్ విండో అధ్యక్షుడిగా డీసీసీబీ డైరెక్టర్ గా గెలిచిన తరవాతే డీసీసీబీ పీఠం దక్కేది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం సహకార సంఘాల్లో ఎన్నికల పక్రియ ను రద్దు చేసింది.

సింగిల్ విండో లకు అధ్యక్షులను నామినేటెడ్ పోస్టులుగా మార్చేసింది. ఇందులో భాగంగానే డీసీసీబీ ఛైర్మెన్ పదవి ని సైతం నామినేటెడ్ చేయబోతుంది. అత్యంత కీలకమైన ఈ పదవి ఎవరికి దక్కాలన్న అంశం చుట్టూ అధికార పార్టీకి చెందిన కీలక నేతల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

అయితే ఇప్పటికే ఈ వ్యవహారం ఢిల్లీ పెద్దలకు దాక వెళ్ళింది. అధిష్టానం ఎవరి వైపు మొగ్గు కడుపుతుందో ననేది ఉత్కంఠగా మారింది రెండు రోజుల పాటు ఢిల్లీ లో మకాం వేసిన మహేష్ కుమార్ ఢిల్లీ పెద్దలను కల్సి డీసీసీబీ ఛైర్మెన్ వ్యవహారం ప్రస్తావించి నట్లుగా సమాచారం ఈ మేరకు పూరన్ రెడ్డి ని పలువురు నేతలకు పరిచయం కూడా చేసారని సమాచారం.

అయితే కాంగ్రెస్ పార్టీ తో ఏ మాత్రం సంబంధం లేని పూరన్ రెడ్డి ఏకంగా డీసీసీబీరేసు లో కి రావడం సీనియర్ కాంగ్రెస్ నేతలకు ఏ మాత్రం మింగుడు పడడం లేదు. కానీ సుదర్శన్ రెడ్డి సిఫారస్ చేస్తున్న కుంట రమేష్ రెడ్డి కన్న పురన్ రెడ్డి ఎంతో బెటర్ అనే వాదన పార్టీవర్గాల్లో బలంగా ఉంది.

అంతే కాదు పురన్ రెడ్డి కి సైతం సుదర్శన్ రెడ్డి తో దగ్గరి బంధుత్వమే ఉంది. ఏడాదిన్నర క్రితమే టిఆర్ యస్ ను వీడి కాంగ్రెస్ లోకి వచ్చారు డీసీసీబి ఛైర్మెన్ గా ఆశించిన మేరకు పనిచేయలేదని విమర్శలున్నాయి ఏకంగా దీంతో డీసీసీబీ చైర్మన్‌ ఎంపిక కేవలం సహకార రంగానికి సంబంధించిన వ్యవహారంగా కాకుండా.. జిల్లాలో కాంగ్రెస్‌ అంతర్గత రాజకీయ సమీకరణాలకు ప్రతిబింబంగా మారింది.

మహేశ్‌గౌడ్‌ వర్సెస్‌ సురేశ్‌రెడ్డి?

ఈ వ్యవహారానికి మరో రాజకీయ కోణం కూడా ఉంది. జిల్లాలో కాంగ్రెస్‌ రాజకీయాల్లో కీలకంగా ఉన్న మహేశ్‌కుమార్‌గౌడ్‌,సుదర్శన్ రెడ్డి వర్గాల మధ్య డీసీసీబీ చైర్మన్‌ ఎంపిక మరో సమీకరణానికి వేదికగా మారుతుందా అన్న చర్చ మొదలైంది.


మహేశ్‌కుమార్‌గౌడ్‌ పురన్‌రెడ్డి పేరును ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారన్న సమాచారం నిజమైతే.. మరోవైపు సుదర్శన్ రెడ్డి రమేశ్‌రెడ్డి కొనసాగింపునకు ప్రయత్నిస్తున్నారన్న ప్రచారం..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments