HomeCRIMEమట్కా ఆడుతున్న వ్యక్తి అరెస్టు..రెండు సెల్‌ఫోన్లు, రూ.2,450 నగదు స్వాధీనం

మట్కా ఆడుతున్న వ్యక్తి అరెస్టు..రెండు సెల్‌ఫోన్లు, రూ.2,450 నగదు స్వాధీనం

నగరంలో మట్కా ఆడుతున్న వ్యక్తిని రెండవ టౌన్ పోలీసులు పట్టుకున్నారు. కసాబ్‌గల్లీలో మట్కా నిర్వహిస్తున్నట్లు పోలీసులకు బుధవారం సమాచారం అందింది. దీంతో అక్కడికి వెళ్లిన పోలీసులు కళ్యాణ్‌కార్‌ శంకర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

అతని వద్ద ఉన్న ఫోన్లలో మట్కా ఆట నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. అతని వద్ద నుంచి నథింగ్‌ ఫోన్‌, నోకియా సెల్‌ఫోన్‌తో పాటు రూ.2,450 నగదును స్వాధీనం చేసుకున్నారు.

నిందితుడిని పోలీస్‌స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేశారు. ఈ మేరకు దర్యాప్తు కొనసాగుతున్నట్లు రెండవ టౌన్ ఎస్ఐ యాదగిరి తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments