HomeTelanganaNizamabadఎండుతున్న వరి పంటలను కాపాడాలి12 గంటల నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేయాలి.. బీజేపీ జిల్లా అధ్యక్షుడు...

ఎండుతున్న వరి పంటలను కాపాడాలి12 గంటల నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేయాలి.. బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్‌ కులాచారి

డిచ్‌పల్లి మండలంలోని మిట్టపల్లి, రాంపూర్‌, కమలాపూర్‌ గ్రామాల్లో ఎండిపోతున్న వరి పంటలను బీజేపీ నిజామాబాద్‌ జిల్లా అధ్యక్షుడు దినేష్‌ కులాచారి గురువారం పరిశీలించారు.

సాగునీరు, విద్యుత్‌ సక్రమంగా అందక పంటలు ఎండిపోతున్న తీరును రైతులను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా దినేష్‌కుమార్‌ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు 12 గంటల నాణ్యమైన విద్యుత్‌ అందించడంలో విఫలమైందని ఆరోపించారు.

పంట చేతికొచ్చే సమయంలో విద్యుత్‌ సరఫరా సక్రమంగా లేకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గంలో రైతుల సమస్యలను పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయిందన్నారు.

ఎమ్మెల్యే భూపతిరెడ్డి ఇతర కార్యక్రమాలకు సమయం కేటాయిస్తున్నారే తప్ప.. ఎండిపోతున్న పంటలను పరిశీలించి రైతులను పరామర్శించేందుకు సమయం కేటాయించడం లేదని విమర్శించారు.గతంలో వడగళ్ల వానతో పంటలు నష్టపోయిన రైతులకు ఇప్పటివరకు పరిహారం అందలేదని అన్నారు.

ప్రస్తుతం విద్యుత్‌, సాగునీరు అందక ఎండిపోయిన పంటలకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి మిగిలిన పంటలను కాపాడేందుకు 12 గంటల నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేయాలని కోరారు.

లేనిపక్షంలో రైతులను పెద్దఎత్తున సమీకరించి కలెక్టరేట్‌ ముట్టడిస్తామని హెచ్చరించారు.కార్యక్రమంలో మండల అధ్యక్షుడు చంద్రకాంత్‌, కిసాన్‌ మోర్చా మండల అధ్యక్షుడు గంగారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు వెల్మ గంగారెడ్డి, ఓంసింగ్‌, దేశపతి శీను, గణేష్‌, ప్రదీప్‌, మండల ప్రధాన కార్యదర్శి సురేష్‌, నవీన్‌, కమలాపూర్‌ సర్పంచ్‌ రత్నం తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments