HomeTelanganaNizamabadఫీజు బకాయిలు వెంటనే విడుదల చేయాలిరూ.12 వేల కోట్ల స్కాలర్‌షిప్‌, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పెండింగ్‌.. ఏబీవీపీ...

ఫీజు బకాయిలు వెంటనే విడుదల చేయాలిరూ.12 వేల కోట్ల స్కాలర్‌షిప్‌, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పెండింగ్‌.. ఏబీవీపీ ఆందోళన

స్కాలర్‌షిప్‌, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో గురువారం ఇందూరు నగరంలోని పలు ప్రభుత్వ కళాశాలల వద్ద ఆందోళన నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు.

ఈ సందర్భంగా ఏబీవీపీ ఇందూరు జిల్లా కన్వీనర్‌ అక్షయ్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో గత రెండేళ్లుగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌లకు సంబంధించిన రూ.12 వేల కోట్లకుపైగా బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని ఆరోపించారు.

దీంతో పేద, మధ్యతరగతి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.ప్రభుత్వం నుంచి కళాశాలలకు నిధులు విడుదల కాకపోవడంతో కొన్ని ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేసేందుకు ఒత్తిడి చేస్తున్నాయని ఆరోపించారు.

విద్యార్థుల ఒరిజినల్‌ ధ్రువపత్రాలను నిలిపివేస్తున్న ఘటనలు జరుగుతున్నాయని తెలిపారు. ఫీజుల భారం కారణంగా కొందరు విద్యార్థులు చదువును మధ్యలోనే నిలిపివేసే పరిస్థితి ఏర్పడుతోందన్నారు.ఎన్నికల సమయంలో సకాలంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌లు అందిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.

పెండింగ్‌ బకాయిలను వెంటనే విడుదల చేయడంతోపాటు ప్రతి ఏడాది విద్యార్థులకు సకాలంలో స్కాలర్‌షిప్‌లు అందేలా గ్రీన్‌ ఛానల్‌ విధానాన్ని పటిష్ఠంగా అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే రాబోయే రోజుల్లో కలెక్టరేట్ల ముట్టడితోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

కార్యక్రమంలో ఏబీవీపీ నగర కార్యదర్శి గాండ్ల నితిన్‌, జోనల్‌ ఇన్‌చార్జి సందీప్‌, నగర సంయుక్త కార్యదర్శి అంబాదాస్‌, నాయకులు శశి, రోహన్‌, క్రాంతి, శ్రావణ్‌, విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments