హత్యాయత్నం కేసులో ఇద్దరు నిందితులకు మూడేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ నిజామాబాద్ సీనియర్ సివిల్ జడ్జి అజయ్ ఉల్లం గురువారం తీర్పు ఇచ్చారు. ఎత్తరి మహేష్, ఎత్తరి బాబులను నేరస్థులుగా నిర్ధారించిన న్యాయస్థానం.. ఒక్కొక్కరికి రూ.1,000 చొప్పున జరిమానా విధించింది.
వివరాల్లోకి వెళితే..టౌన్-V పోలీస్‌స్టేషన్ పరిధిలో 2018లో జరిగిన ఘటనపై క్రైం నంబర్ 57/2018గా కేసు నమోదైంది. సెక్షన్ 307 రెడ్‌విత్ 34 ఐపీసీ కింద పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తు అధికారిగా ఎస్‌ఐ టి.శ్రీహరి వ్యవహరించారు.
విచారణ సందర్భంగా పోలీసుల తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆర్.ఎస్.ఎల్. గౌడ్ వాదనలు వినిపించారు.కేసు విచారణలో లైజన్ అధికారి ఎస్‌ఐ గోవింద్, బ్రీఫింగ్ అధికారి ఎస్‌ఐ దుబ్బాక సునీల్, సీడీవోలు డి.బాలకృష్ణ, డి.రమేష్, సీఎంఎస్ సీడీవో ఈ.కిషోర్ తదితరులు సమన్వయంతో పనిచేశారు.
నిందితులకు శిక్ష పడేలా సమర్థవంతంగా దర్యాప్తు, విచారణలో సహకరించిన అధికారులు, సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు.
