నిజామాబాద్ నగరంలోని ఐదో టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం ఉదయం విషాద ఘటన చోటుచేసుకుంది. వర్ని చౌరస్తా వద్ద డీసీఎం వాహనాన్ని రివర్స్ తీస్తుండగా ప్రమాదం జరిగింది.
ఈ క్రమంలో ఓ వ్యక్తి వాహనం టైరు కింద పడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
