నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ) చైర్మన్ పదవి ఫై అధికార పార్టీలో కసరత్తులు కొలిక్కి వచ్చాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యే లూ తాము సిఫార్స్ చేసిన వారికి ఛైర్మెన్ స్థానం ఇవ్వాలని గట్టిగా పట్టుబడుతున్నారు. దీనితో సీఎం సైతం వారు వైపే మొగ్గు చూపుతున్నారు.
దీనితో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వ్యూహాత్మకంగా వెనక్కి తగ్గి నట్లుగా సమాచారం. ప్రస్తుతం ఛైర్మెన్ గా ఉన్న కుంట రమేష్ రెడ్డి మరో సారి డీసీసీబీ ఛైర్మెన్ గా నియామకం అవ్వడం దాదాపు ఖాయం అయింది.జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యే ల్లో సుదర్శన్ రెడ్డి తన కుటుంబ సభ్యుడైన కుంట రమేష్ రెడ్డి కోసం పావులు కదుపుతున్నారు.
రమేష్ రెడ్డి డీసీసీబీ ఛైర్మెన్ గా నియామకం కావడంలోను సుదర్శన్ రెడ్డి చక్రం తిప్పారు.అందుకే ఆయననే కొనసాగించాలని పట్టుబడుతున్నారు. మరో ఎమ్మెల్యే భూపతి రెడ్డి సైతం కుంట రమేష్ రెడ్డి కి ఇవ్వాలని అడుగుతూన్నారు. ఆయన గతంలో టిఆర్ యస్ లో మంత్రి ప్రశాంత్ రెడ్డి కి అత్యంత సన్నిహితుడి గా ఉండి డీసీసీబీ వైస్ ఛైర్మెన్ గాపనిచేసారు.
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పార్టీ మారి అవిశ్వసం తో భాస్కర్ రెడ్డి వైదొలగడంతో ఛైర్మెన్ స్థానం దక్కించుకున్నారు. డీసీసీబీ పాలక మండళ్ల పదవి కాలం పూర్తీ కావడంతో ఈసారి నామినేటెడ్ పద్దతి లో డీసీసీబీ పాలక మండళ్ల ను నియమించాలని ప్రభుత్వం ఉత్తర్వ్యూలను జారీచేసింది.
అందుకే అత్యంత కీలకమైన ఈ పదవి ఎవరికి దక్కాలన్న అంశం చుట్టూ అధికార పార్టీకి చెందిన కీలక నేతల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పీసీసీ చీఫ్ మహేష్ రెడ్డి పూరన్ రెడ్డి ని తెరమీదికి తెచ్చారు కాంగ్రెస్ పార్టీ తో ఏ మాత్రం సంబంధం లేని పూరన్ రెడ్డి ఏకంగా డీసీసీబీరేసు లో కి రావడం సీనియర్ కాంగ్రెస్ నేతలకు ఏ మాత్రం మింగుడు పడడం లేదు. కానీ సుదర్శన్ రెడ్డి తో పాటు భూపతి రెడ్డి లు కల్సి కట్టుగా కుంట రమేష్ రెడ్డి కోసం పట్టు బడుతున్నారు.
దీనితో సీఎం రేవంత్ రెడ్డి సైతం రమేష్ రెడ్డి వైపు మొగ్గు చూపుతన్నారు. మహేష్ కుమార్ సైతం వ్యూహాత్మకంగా వెనక్కి తగ్గడం తో రమేష్ రెడ్డి కి డీసీసీబీ పీఠం దాదాపు ఖరారు అయింది.
కీలకమైన ఐడిసియంఎస్ ఛైర్మెన్ స్థానం ఖచ్చితంగా బీసీ లకు కేటాయించేలా మహేష్ ఇద్దరు ఎమ్మెల్యే లను ఒప్పించారు నిజామాబాద్ అర్బన్ నుంచి ఒక్కరిని ఐడిసియం చైర్మన్ గా నియామకం కానున్నారు
