HomeDevotionalనేడు కొలువుదీరనున్న దుర్గామాత..

నేడు కొలువుదీరనున్న దుర్గామాత..

వైభవంగా దుర్గామాతల ఆగమనం!* అడుగడుగునా ఆధ్యాత్మిక సందడి* భవానీ మాలధారుల పూజలు.. పూలు, పండ్ల మార్కెట్లలో రద్దీఅమ్మవారి ఆగమనం.. భక్తుల కోలాహలం..మంగళవాయిద్యాలు, పూలమాలలు, విద్యుద్దీపాల అలంకరణల నడుమ దుర్గామాత విగ్రహాలను మండపాలకు తీసుకొస్తున్నారు.

జిల్లావ్యాప్తంగా పలు ప్రాంతాల్లో అమ్మవారి ఆగమన కార్యక్రమాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. భక్తులు భక్తిశ్రద్ధలతో స్వాగతం పలుకుతుండగా.. నేడు ప్రత్యేక పూజల అనంతరం దుర్గామాత విగ్రహాలు మండపాల్లో కొలువుదీరనున్నాయి.

మరోవైపు భవానీ దీక్షలు స్వీకరించిన భక్తులతో ఆలయాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. వీధివీధినా వెలసిన దుర్గామాత మండపాలు.. విద్యుద్దీపాల కాంతుల్లో మెరిసిపోతున్నాయి. పూలమాలల అలంకరణలు.. అమ్మవారి నామస్మరణలు.. భవానీ దీక్షాధారుల పూజలతో నగరం భక్తిమయంగా మారింది.

జిల్లావ్యాప్తంగా ఏర్పాటు చేసిన మండపాల్లో నేడు దుర్గామాత విగ్రహాలు కొలువుదీరనున్న నేపథ్యంలో నిర్వాహకులు ఏర్పాట్లను పూర్తి చేశారు. అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు సిద్ధమవుతున్నారు.గ్రామాలు, పట్టణాల్లో దుర్గామాత మండపాలను నిర్వాహకులు రంగురంగుల విద్యుద్దీపాలు, పూలమాలలతో అలంకరించారు.

ఇప్పటికే పలు మండపాలకు విగ్రహాలను తీసుకొచ్చారు. నేడు అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, పూజలు నిర్వహించనున్నారు. భవానీ దీక్షలు స్వీకరించిన యువతతో పాటు చిన్నారులు, పెద్దలు భక్తిశ్రద్ధలతో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.

అమ్మవారి పూజలకు అవసరమైన పూలు, పండ్లు, నిమ్మకాయల కొనుగోళ్లతో నిజామాబాద్‌ నగరంలోని మార్కెట్లు సందడిగా మారాయి. పూజా సామగ్రికి గిరాకీ పెరిగింది.

పండుగ అవసరాల కోసం కొనుగోలుదారులు మార్కెట్లకు వస్తుండటంతో ప్రధాన వ్యాపార ప్రాంతాల్లో రద్దీ కనిపిస్తోంది.నగరంలోని దేవి రోడ్డు దేవీమాత ఆలయం, ముబారక్‌నగర్‌ పెద్దమ్మ ఆలయం, గంగాస్థాన్‌ మహాలక్ష్మి ఆలయాల్లో భక్తులు భవానీ దీక్షలు స్వీకరిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహిస్తున్నారు. దుర్గామాత ఆరాధనతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments