స్కార్పియో వాహనంలో వచ్చి ఏటీఎం ఎత్తుకెళ్లిన దుండగులు.. రూ.8 నుంచి 10 లక్షలు ఉన్నట్లు అంచనా
కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలో అర్ధరాత్రి ఏటీఎం చోరీ ఘటన కలకలం రేపింది. ఆదివారం అర్ధరాత్రి ఒంటి గంట నుంచి రెండు గంటల మధ్య స్కార్పియో వాహనంలో వచ్చిన దుండగులు ఏటీఎంను ఎత్తుకెళ్లినట్లు సమాచారం.
చోరీకి గురైన ఏటీఎంలో సుమారు రూ.8 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు నగదు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చోరీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని, విచారణ అనంతరం మరిన్ని వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.
