HomeHEALTHపాము కాటుకు గురైన తొమ్మిదేళ్ల బాలుడికి పునర్జన్మ ...నిజామాబాద్ వైద్యుల సమయస్ఫూర్తితో ప్రాణాలు దక్కించుకున్న చిన్నారి...

పాము కాటుకు గురైన తొమ్మిదేళ్ల బాలుడికి పునర్జన్మ …నిజామాబాద్ వైద్యుల సమయస్ఫూర్తితో ప్రాణాలు దక్కించుకున్న చిన్నారి అజాన్

పాము కాటుకు గురై వెంటిలేటర్‌పై నాలుగు రోజులు పోరాడి కోలుకున్న వైనం * ఆసుపత్రి పనితీరు, వైద్య సేవలపై ఇంచార్జీ సూపరింటెండెంట్ డాక్టర్ రాములు వెల్లడినిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఓ బాలుడికి వైద్యులు పునర్జన్మ ప్రసాదించారు. అత్యంత విషపూరితమైన పాము కాటుకు గురై, మృత్యువుతో పోరాడిన తొమ్మిదేళ్ల బాలుడిని వైద్యుల బృందం విజయవంతంగా కాపాడింది.

సమయస్ఫూర్తితో వ్యవహరించి, సరైన సమయంలో వైద్యం అందించడంతో చిన్నారి ప్రాణాపాయం నుండి బయటపడ్డాడని ఇంచార్జీ సూపరింటెండెంట్ డాక్టర్ రాములు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం బాన్సువాడకు చెందిన తొమ్మిదేళ్ల బాలుడు అజాన్ నిద్రలో ఉండగా, తెల్లవారుజామున 3:15 గంటల ప్రాంతంలో మెడ చుట్టూ కట్లపాము చుట్టుకుని కాటేసింది.

అది అత్యంత ప్రమాదకరమైన, విషపూరితమైన పాము కావడంతో పాటు ఒకటి కంటే ఎక్కువసార్లు కాటు వేయడంతో బాలుడు తీవ్ర అపస్మారక స్థితికి చేరుకున్నాడు. కుటుంబ సభ్యులు వెంటనే బాలుడిని నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు.

ఆసుపత్రికి వచ్చేసరికే బాలుడి కనురెప్పలు వాలిపోయి (డ్రూపింగ్), శ్వాస ఆడక రెస్పిరేటరీ పారాలిసిస్ దశకు చేరుకున్నాడు. వెంటనే అప్రమత్తమైన పీడియాట్రిక్స్ హెచ్‌వోడీ డాక్టర్ శ్రీకాంత్ ఆధ్వర్యంలోని వైద్యుల బృందం బాలుడిని పరీక్షించి అత్యవసర చికిత్స ప్రారంభించింది.

దాదాపు 15 నుండి 25 వయల్స్ యాంటీ స్నేక్ వీనం అందించినప్పటికీ పరిస్థితి కుదుటపడకపోవడంతో, వెంటనే వెంటిలేటర్‌పైకి మార్చారు. నాల్గో రోజు ట్యూబ్ తొలగించగా, బాలుడు పూర్తిగా కోలుకున్నాడని డాక్టర్ శ్రీకాంత్ తెలిపారు. ఇలాంటి తీవ్ర విషపూరితమైన కేసుల నుండి రోగి కోలుకోవడం చాలా అరుదని ఆయన పేర్కొన్నారు.

అలాగే ఆసుపత్రిలో ప్రతిరోజు ఓపీ సేవలు పొందే వారి సంఖ్య 2000 నుండి 2500 వరకు ఉంటోంది. మొత్తం 750 బెడ్ల సామర్థ్యం కలిగిన ఈ ఆసుపత్రిలో దాదాపు 100% బెడ్ ఆక్యుపెన్సీ ఉంటోంది.గతంలో నెలకు 400–450గా ఉన్న డెలివరీల సంఖ్య గత నెలలో 616కి పెరిగింది.

పీడియాట్రిక్స్ విభాగం కొత్త భవనంలోకి మారిన తర్వాత నవజాత శిశువుల (SNCU) విభాగంలో రద్దీ విపరీతంగా పెరిగిందని, నిత్యం 200 వరకు అడ్మిషన్లు జరుగుతున్నాయని తెలిపారు.ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు:పాముల విషయంలో గ్రామీణ ప్రాంత ప్రజలు, రైతులు తీవ్ర అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఇళ్ల చుట్టూ మట్టి కుప్పలు, కట్టెలు, గడ్డిని నిల్వ చేయవద్దని, పొలాలకు వెళ్లేటప్పుడు టార్చ్ లైట్, షూస్ లేదా ప్లాస్టిక్ బూట్లు ధరించాలని కోరారు.

పాము కాటు వేస్తే భయపడకుండా, కరిచిన భాగాన్ని కదలకుండా ఉంచి, వెంటనే వెంటిలేటర్ సపోర్ట్ ఉన్న పెద్ద ఆసుపత్రికి (టెర్షియరీ కేర్) తరలిస్తేనే ప్రాణాలు కాపాడుకోవచ్చని ఆయన స్పష్టం చేశారు. ఈ సమావేశంలో లో పీడియాట్రిక్స్ హెచ్‌వోడీ డాక్టర్ శ్రీకాంత్, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments